News

మ‌హారాష్ట్ర‌లో 40 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

661views

ముంబై: దేశంలో అక్రమంగా నివసిస్తున్న 40 మంది బంగ్లాదేశీయులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. భివాండి పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో వీరంతా పని చేస్తూ ఉన్నారు. అలా మొత్తం 40 మంది బంగ్లా జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద సరైన ధ్ర‌వ‌ప‌త్రాలు లేవ‌ని స్పష్టంగా తెలుస్తోంది.

నిందితుల వ‌ద్ద నుంచి నకిలీ ఆధార్‌ కార్డులు, పాస్‌పోర్టులు, పాన్‌ కార్డులు, రూ.94 విలువచేసే 28 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముంబై, గుజరాత్‌, భివాండి చిరునామాలతో నకిలీ పత్రాలు ఉన్నాయని వెల్లడించారు. వారు తమ బంధువులు, సరిహద్దులు దాటించిన వ్యక్తితో ఐఎంపీవో యాప్‌ సహాయంతో మాట్లాడుతున్నారని చెప్పారు. వారందరిపై కేసు నమోదుచేశామన్నారు.

భివాండిలోని మూడు వేర్వేరు పోలీసు స్టేషన్ ప‌రిధిల్లో వారు ఇన్ని రోజులు బ‌తుకుతూ వచ్చారు. భివాండిలోని జోన్ 2 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) యోగేష్ చవాన్ విలేఖ‌రులతో మాట్లాడుతూ, అరెస్టు చేసిన వ్యక్తులు వేర్వేరు ప్రదేశాలలో కార్మికులుగా పనిచేస్తున్నారని చెప్పారు. భారత్‌లో ఉండేందుకు వారి వద్ద సరైన పత్రాలు లేవని చెప్పారు. భారత పాస్‌పోర్ట్ చట్టం, విదేశీ పౌరుల చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి