
-
సెలవు అడిగితే లంచం అడిగిన పై అధికారి
-
పాలకుల తీరుతో మంటల్లో మానవత్వం
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో అక్కడి పరిపాలకుల చేతకానితనం వల్ల దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మైనారీలపై వేధింపులు, ఉగ్రవాదులను పెంచిపోషించడం, హిందూ దేవాలయాలను కూల్చడం వంటి సంఘటనలే ఇప్పటి వరకు చూశాం… తాజాగా మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అక్కడి ఓ చిరుద్యోగి.. కొడుకు వైద్యం కోసం పై అధికారికి సెలవు అడిగాడు. ఆ అధికారి మానవత్వం లేకుండా లంచాన్ని డిమాండ్ చేశాడు.
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కీ జిల్లాలో నిసార్ లషారీ అనే వ్యక్తి జైళ్ళ శాఖలో పోలీసుగా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు. ఒక పిల్లాడికి చికిత్స కోసం తన పై అధికారికి సెలవుకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఆ అధికారి లంచం డిమాండ్ చేశాడు. దీంతో నిసార్ తన ఇద్దరు పిల్లలని అమ్మకానికి పెట్టాడు. అంతేకాదు, నేను చాలా పేదవాడిని… తన సీనియర్స్ చేస్తున్న పనిపై ఫిర్యాదు చేయడానికి కరాచీకి కూడా వెళ్లలేను. అందుకనే ఇలా చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.
తన ఇద్దరు పిల్లలను 50,000 పాకిస్తానీ రూపాయలకు అమ్ముతున్నానని .. కావాల్సిన వారు కొనుకోవచ్చని నిరసన వ్యక్తం చేశాడు. పోలీసు యూనిఫామ్‌ను ధరించిన ఆ పోలీసు తన ఇద్దరు చిన్న పిల్లలతో రద్దీగా ఉన్న ప్రధాన రహదారి మధ్యలో నిలబడి గట్టిగా అరుస్తున్నాడు.
گھوٹکی کے پولیس اہلکار کو بچے کے علاج کے لیے چھٹی نہ ملی اور لاڑکانہ تبادلہ کردیا گیا، چھٹی لینے اور تبادلہ رکوانے کے لیے افسران کو پچاس ھزار روپے رشوت دینی پڑے گی، اہلکار پچاس ھزار میں ایک بیٹا بیچنے کی آوازیں لگاتا رہا۔
ہائے انسانیت کہاں ہے ?? pic.twitter.com/i9hRF7IsNQ— Sheikh Sarmad (@ShSarmad71) November 13, 2021
అంతేకాదు… ‘నేను నాదగ్గర ఉన్న కొంచెం డబ్బులను లంచంగా చెల్లించాలా.. లేక బిడ్డ ఆపరేషన్ కోసం కట్టాలా? నేను లర్కానాలో పనిచేయాలా లేక నా బిడ్డను చికిత్స కోసం తీసుకెళ్లాలా?’ అని అతను కన్నీళ్ళపర్యంతమయ్యాడు. ఈ సంగతి చివరికి సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షాకి చేరుకుంది. వెంటనే షా జోక్యం చేసుకుని ఆ పిల్లవాడి వైద్యం కోసం 14 రోజులు సెలువు మంజూరు చేశారు.
Source: Tv9





