News

భారత నౌకాదళంలోకి ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’

650views

విశాఖపట్నం: భారత నావికాదళంలోకి మరో నూతన యుద్ధనౌకను ప్రవేశపెట్టారు. దేశీయంగా రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధనౌకను ఇవాళ జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో రక్షణమంత్రి రాజ్నాథ్‌ సింగ్‌ చేతుల మీదుగా ఈ నౌకను నావికాదళంలో ప్రవేశపెట్టారు. దీన్ని విశాఖపట్నంలో మోహరింపజేయనున్నారు. ఈ సదర్భంగా మాట్లాడిన రాజ్‌నాథ్‌ సింగ్‌.. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా స్వదేశీ నౌకలు, జలాంతర్గాముల తయారీలో భారత్‌ ముందంజలో ఉన్నదన్నారు. దేశం కోసం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల అవసరాలను తీర్చేందుకు నౌకలను నిర్మించే సత్తా భారత దేశానికి ఉందని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి