
479views
న్యూఢిల్లీ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్).. అథ్లెట్లకు మొట్టమొదటిసారి ఇన్స్టిట్యూషనల్ పురస్కారాలను ప్రదానం చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మెరుగైన ప్రదర్శన చేసిన 162 మంది ఆటగాళ్లకు, 84 మంది కోచ్‌లను సత్కరించింది. ఈ మేరకు రూ.85.02 లక్షల నగదును అందించింది. ఈ కార్యక్రమానికి భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు. 2016 నుంచి గతేడాది వరకు ఆటల్లో మంచి ఫలితాలు కనబరిచిన అథ్లెట్లకు, కోచ్‌లకు అవార్డులు ప్రదానం చేశారు. అత్యత్తమ, ఉత్తమ పురస్కారాలు అనే రెండు జాబితాల్లో పురస్కారాలు ఇచ్చారు.





