News

నేటి నుండి శబరిమల అయ్యప్ప దర్శనం

750views

తిరువ‌నంత‌పురం: కేరళలోని శబరిమల ఆలయం నేడు తెరుచుకుంది. రెండు నెలలపాటు అందుబాటులో ఉండనుంది. రోజుకు 30 వేల మందిని వర్చువల్‌ క్యూ విధానంలో ఆలయంలోకి అనుమతించనున్నట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి. 2022 జనవరి 14న మకరజ్యోతి దర్శనం తర్వాత.. అదేనెల 20న ఆలయాన్ని మళ్లీ మూసివేయనున్నారు. శబరిమలకు వచ్చే భక్తులు రెండు డోసులు తీసుకున్నట్టు ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుందని, లేని పక్షంలో దర్శనానికి 72 గంటల ముందు ఆర్​టీ-పీసీఆర్​ నెగిటివ్ రిపోర్టును సమర్పించాలి. వాహనాలకు నీలక్కల్ వరకే అనుమతి ఉంటుంది. అక్కడి నుంచి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి