News

శభాష్‌ పోలీస్‌!

688views
  • వ్యక్తిని రక్షించిన ఎస్‌ఐ రాజేశ్వరి

చెన్నై: తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. చెన్నైలోని టీపీ చత్రం ప్రాంతంలోని శ్మశానవాటికలో అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి గుర్తించారు.

అతడిని తానే స్వయంగా భుజాలపై మోసుకెళ్లి ఆటోలోకి ఎక్కించి, ఆస్పత్రికి తరలించారు. ఈ కార్యం చేపట్టిన ఆమెను సామాన్య వ్యక్తి నుంచి ప్రముఖుల వరకు ప్రశంసిస్తున్నారు. శభాష్‌ రాజేశ్వరి… అంటూ అభినందిస్తున్నారు. కాగా, వర్షం, వరదల వల్ల శనివారం నుంచి ఇప్పటివరకు 12 మంది మరణించారని తమిళనాడు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కుమార్‌ జయంత్‌ తెలిపారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి