News

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

604views
  • పెట్రోల్‌ ట్యాంకర్‌ – బస్సు ఢీ

  • 10 మంది సజీవ దహనం

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, బస్సు ఢీకొనడంతో పదిమంది దుర్మరణం చెందినట్టు సమచారం. ట్రక్కు – ప్రైవేటు బస్సు ఎదురెదురుగా ఢీకొనగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పోలీసులు అంటున్నారు. జోధ్‌పూర్‌ ప్రాంతంలోని బార్మర్‌-జోధ్‌పూర్‌ హైవేపై పచ్‌పద్ర సమీపంలో ఈ రోజు ఉదయం పది గంటలకు ఈ దుర్ఘన చోటుచేసుకుంది. పెట్రోల్‌ ట్యాంకర్‌ బస్సును ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగిందంటున్నారు. ప్రమాదం అనంతరం ప్రైవేట్‌ బస్సు మంటల్లో చిక్కుకుందని పోలీసులు తెలిపారు. బస్సులో 25 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి