
502views
వంట నూనెలపై 2.5% ఉన్న ప్రాథమిక సుంకాలను సున్నాకి తగ్గించడంవల్ల వాటి ధరలు తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర ఆహారం, పౌరసరఫరాలు, వినియోగవ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ముడి పామాయిల్ పై అగ్రిసెస్ ను 20% నుంచి 7.5%కి తేవడం, ముడి సోయాబిన్, సన్ ఫ్లవర్ ఆయిల్ పై దీన్ని 5% కి తగ్గించడంవల్ల వినియోగదారుడికి అందే ధరల్లో ఆ ప్రభావం కనిపిస్తున్నట్లు తెలిపింది. ప్రధాన ఉత్పత్తిదారులైన ఆదానీ విల్మర్, రుచి ఇండస్ట్రీస్ టోకు ధరలను ఒక్కో లీటర్‌పై రూ.4 నుంచి రూ.7దాకా తగ్గించినట్లు పేర్కొంది. దీనివల్ల వినియోగదారులకు ఉపశమనం లభిస్తున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.





