
655views
భారత్ లో వేర్పాటువాద శక్తులకు నిధులు సమకూరుస్తున్న సంస్థలపై ఆరా తీయడానికి నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) బృందం ఒకటి శుక్రవారం కెనడా చేరుకుంది. ఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యం వహిస్తున్న ఈ బృందంలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. నాలుగు రోజుల పాటు అక్కడ ఉండి దర్యాప్తు చేయనున్నారు. ఖలిస్థాన్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న సిఖ్స్ ఫర్ జస్టిస్, జిందాబాద్ ఫోర్స్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ వంటి సంస్థల వ్యవహారాలను పరిశీలించనుంది. కెనడాతో పాటు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీల ద్వారా నిధులు పంపిస్తుండడంపై కూపీ లాగనుంది.





