News

ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం

395views

కార్తీకమాసంలో ఏటా దుర్గమ్మను, ఆలయాన్ని గాజులతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉత్సవంలో భాగంగా అమ్మవారి మూలవిరాట్ ‌ను వివిధ రకాల మట్టి గాజులతో అలంకరించారు. అమ్మవారి ప్రధాన ఆలయం తో పాటు ప్రాంగణాన్ని రంగురంగుల గాజులతో ముస్తాబు చేశారు. ఇంద్రకీలాద్రిపై 2016 నుంచి ప్రారంభించిన ఈ విశేష పూజ ఎంతో ప్రాచుర్యం పొందింది. అమ్మవారి గాజుల అలంకరణకు అవసరమైన కొన్ని గాజులను దేవస్థానం కొనుగోలు చేసింది. భక్తులు కూడా భారీ స్థాయిలో గాజులు విరాళంగా దేవస్థానానికి అందిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. 15, 18వ శతాబ్దంలో అమ్మవారికి గాజుల అలంకారం చేసినట్లు పురాణాల్లో ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.