
వారణాసికి చెందిన 125 ఏళ్ల స్వామి శివానంద ఈ వారంలో తన రెండవ డోస్ కోవిడ్ -19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో అతి పెద్ద వయస్కులు వీరే కావడం గమనార్హం.
1896లో జన్మించిన స్వామి శివానంద పశ్చిమ బెంగాల్ కు చెందినవారు. ఆయన నాలుగు దశాబ్దాలుగా వారణాసిలోనే నివసిస్తున్నారు. దుర్గాకుండ్ లోని సీఎంఓ కార్యాలయ ఆవరణలో ఉన్న అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆయనకు వ్యాక్సిన్ వేశారు.
కోవిడ్-19కి వ్యతిరేకంగా భారతదేశం యొక్క టీకా డ్రైవ్ ప్రపంచంలోనే అతిపెద్దది. డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు మొదలైన ఫ్రంట్ లైన్ యోధులతో ప్రారంభించి, ఈ ఏడాది జనవరిలో దేశం కోవిడ్-19కి వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ ను ప్రారంభించింది. ఈ క్రమంలో భారత్ ఈ మధ్యనే వ్యాక్సినేషన్ ప్రక్రియలో 100 కోట్ల మైలురాయిని సాధించిన విషయం పాఠకులకు విదతమే.
Source : Organiser.





