News

నేటి నుంచి భారత్- ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు

579views

న్యూఢిల్లీ: నేటి నుంచి 18వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులు జరగనున్నాయి. ఆగ్నేయాసియాకు చెందిన ఇండోనేసియా, పిలిప్పిన్స్​, సింగపూర్​, థాయి​లాండ్​, బ్రూనై, వియత్నాం, లావోస్​, మయన్మార్​, కంబోడియా ఉన్న ఈ కూటమిలో.. భారత్​, చైనా, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా దేశాలు భాగస్వామ్య​ దేశాలుగా ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సదస్సులో భారత్, చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్, రష్యాలు సభ్య దేశాలతో పాటు పాల్గొంటున్నాయి.
ఆసియాన్ దేశాలు-భారత్ మధ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా మంచి ఫలితాలనిస్తున్నాయి. ప్రధానంగా.. పెట్టుబడులు, వాణిజ్యం, భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించే అంశాలపై భారత్ గతకొన్నాళ్లుగా దృష్టి సారిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి