News

పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం దిశగా ప్రయత్నాలు

724views
  • భారత వైమానిక దళ ఉన్నతాధికారి ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్​ను భారత్​ ఏదో ఒక రోజు వశం చేసుకుంటుందని వాయుసేన ఉన్నతాధికారి, వెస్టర్న్ ఎయిర్ కమాండ్ చీఫ్​ ఎయిర్ మార్షల్​ అమిత్ దేవ్​ అన్నారు. ప్రస్తుతానికి పీవోకే గురించి ఎలాంటి ప్రణాళికలు లేవని చెప్పారు. బుద్గాంలో సైన్యం అడుగుపెట్టి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

“1947 అక్టోబర్‌ 27న సైన్యం, వాయుసేన చేపట్టిన ఆపరేషన్ వల్లే కశ్మీర్​కు స్వేచ్ఛ లభించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలను అక్కడి ప్రభుత్వం సరిగ్గా చూడటం లేదు. ఏదో ఒకరోజు పాకిస్థాన్‌ ఆక్రమిక కశ్మీర్‌ కూడా ఈ ప్రాంత కశ్మీర్‌లో చేరుతుందని కచ్చితంగా చెప్పగలను.” అని అమిత్ దేవ్ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి