News

సరిహద్దు వివాదం పరిష్కారం వరకు చైనాతో చర్చలు

417views
  • రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: లద్దాఖ్​ సరిహద్దు ప్రతిష్టంభన అంశంపై శాంతియుత పరిష్కారం కోసం చైనాతో చర్చలు కొనసాగుతాయని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ స్పష్టం చేశారు. సరిహద్దు రక్షణకు భారత సైన్యం దృఢనిశ్చయంతో ఉందన్నారు. దేశ భద్రతా సవాళ్లపై మిలిటరీ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో రాజ్​నాథ్ మాట్లాడారు. సైన్యానికి కావల్సిన ఆయుధ సామగ్రిని, మౌలిక సదుపాయాలను సమకూర్చడం, జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదాన్ని అరికట్టడం తదితర విషయాలు చర్చకు వచ్చాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి