News

అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం

369views
  • చైనా డాంగ్ ఫ్ంగ్ క్షిపణికి పోటీగా ప్రయోగం

భువ‌నేశ్వ‌ర్‌: చైనా వద్ద ఉన్న 12వేల నుంచి 15వేల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే డాంగ్‌ఫెంగ్‌-41 క్షిపణికి పోటీగా అణ్వాయుధ సామర్ధ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా భారత్‌ అగ్ని-5ను అభివృద్ధి చేసింది. 17 మీటర్ల పొడవుండే అగ్ని-5 క్షిపణి 1.5 టన్నుల వార్‌హెడ్‌లను మోసుకువెళ్లగలదు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్ధ డీఆర్​డీఓ దీనిని అభివృద్ధి చేసింది.

ఘన ఇంధనంతో మూడు దశల్లో పని చేసే ఇంజన్‌ సాయంతో ఇది ముందుకు సాగుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. చైనాకు మరింత సవాల్‌ విసిరేలా 5వేల కిలోమీటర్ల లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల అగ్ని-5 బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని భారత్‌ విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి బుధవారం రాత్రి ఏడు గంటల 50 నిమిషాలకు ఈ ప్రయోగాన్ని జరిపింది.

ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదు. అగ్ని-5 ఖండాంతర క్షిపణి ప్రాజక్టు పని దశాబ్దం క్రితం ప్రారంభం కాగా, దీనిని ఏడు సార్లు ప్రయోగించారు. ఇప్పటికే భారత సైన్యంలో మోహరించిన అగ్ని-1 నుంచి అగ్ని-4 శ్రేణి క్షిపణులు 7వందల నుంచి 3వేల 5వందల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే సామర్ధ్యాన్ని కల్గి ఉన్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి