
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో పర్యటించాలని.. రథయాత్ర నిర్వహించాలని భావించారు. అయితే మమతా బెనర్జీ ప్రభుత్వం మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో బీజేపీ నాయకులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం మాత్రం అమిత్ షా రథయాత్రకు అనుమతిని ఇచ్చింది.
అమిత్ షా రథయాత్రకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించడంతో బీజేపీ శ్రేణులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్ ను విచారించిన హైకోర్టు… రాష్ట్రంలో మూడు రథయాత్రలకు అనుమతించింది. ఇదే సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రథయాత్రలు చట్టానికి లోబడి ఉన్నప్పుడు వాటిని అడ్డుకోవడం సరికాదని ఈ సందర్భంగా ధర్మాసనం చెప్పింది. ఇక పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకులకు కూడా ధర్మాసనం పలు సూచనలు చేసింది. రథ యాత్రకు సంబంధించిన అన్ని అంశాలు పోలీసు డిపార్ట్మెంట్ కు చెప్పాలని సూచించింది. బెంగాల్ బీజేపీ సీనియర్ నేత కైలాష్ మాటాడుతూ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. మమతా బెనర్జీ ప్రభుత్వం తమను అడ్డుకోవాలని భావించిందని.. ధర్మాసనం ఇచ్చిన తీర్పు వాళ్లకు ఓ గుణపాఠం అని ఆయన అన్నారు.
Source: Bharath Today.





