News

న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. ఇవన్నీ తప్పక పాటించాల్సిందే..!

1.3kviews

న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. హోటల్స్, పబ్ లు, రిసార్ట్స్, ఫామ్ హౌస్ లు 31 న రాత్రి 8 గంటల నుంచి అర్ధారత్రి ఒంటి గంట వరకే పార్టీలకు అనుమతి ఉందని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ తెలిపారు. డ్రగ్స్, హుక్కా, రేవ్ పార్టీలకు అనుమతి లేదన్నారు. పోలీసులు విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.

2019 న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు హైదరాబాద్ పోలీసులు. ఇటీవల నగరంలోని కొన్ని స్టార్ హోటల్స్, పబ్ లలోఅసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాయని పోలీసులకు పిర్యాదులు రావడంతో హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్టార్ హోటల్స్, పబ్ లపై నిఘా పెట్టామని కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. హోటల్స్, పబ్ లు 31 న రాత్రి 8 గంటల నుంచి అర్ధారత్రి ఒంటి గంట వరకే పార్టీలకు అనుమతి ఉందన్నారు.

న్యూ ఇయర్ వేడుకలలో డిజే సౌండ్, హుక్కా, డ్రగ్స్, రేవ్ పార్టీలకు అనుమతి లేదన్నారు ఖాకీలు. పోస్టర్స్, హొర్డింగ్స్ పబ్లిక్ ప్లస్ లో నిషేధించారు. తాగి వాహనాలు నడిపే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లైసెన్స్ ఆయుధాలను వెంట తీసుకొచే వారిని పార్టీలకు అనుమతించొద్దని నిర్వాహకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హోటల్స్, పబ్ ల నిర్వాహకులు 31 న రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు జరిగే పార్టీలను సీసీ కెమెరాలతో రికార్డు చేయాలని సూచించారు.

Source: Bharath Today.