
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ ఘటనకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం విదితమే. ఆదివారం తర్వాత చోటు చేసుకున్న ఘటనల్లో మరణించినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాతోపాటు 13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. లఖీంపూర్ ఖేరీలో పరిస్థితి ఉద్రిక్తతగా ఉంది. ఘటన జరిగిన తికునియా గ్రామం చుట్టూ భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా, ఏబీపీ న్యూస్ రిపోర్టర్ రామన్ కశ్యప్ లఖీంపూర్ ఖేరీలో చెలరేగిన హింసలో మరణించినట్టు ప్రకటించారు. మీడియా హౌస్ ఎడిటర్ పంకజ్ రaా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. ‘లఖీంపూర్ ఖేరీ హింసను కవర్ చేస్తున్న మా సహచరులలో ఒకరు చనిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అతి దగ్గరలో ఉన్నందుకు పకడ్బందీగా ప్రణాళికతో హింసకు ప్రతి పక్షాలు పాల్పడుతున్నాయని అంటున్నారు. ఈ ఘటన దర్యాప్తులో ఉందని ఉత్తర ప్రదేశ్ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు. విపక్షాలు ఈ ఘటనను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటూ ఉన్నారని.. విపక్షాలు రాజకీయం కోసం ఈ సంఘటనను ఉపయోగిస్తున్నాయని ఆయన విమర్శించారు.
Source: NationalistHub





