News

కాషాయ జెండాను తొలగించిన ముస్లిం మూక!

735views
  • మతోన్మాదులతో ఛత్తీస్‌గఢ్‌లో అల్లర్లు

  • ముగ్గురికి గాయాలు

  • విద్యాసంస్థలు మూసివేత

  • రంగంలోకి భద్రతా బలగాలు

  • 144 సెక్షన్‌ విధింపు

కవార్ధా: ఛత్తీస్‌గఢ్‌లో ముస్లిం మతోన్మాదులతో అల్లర్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఓ స్తంభంపై ఉన్న కాషాయ జెండాను ముస్లిం మూక బరితెగించి తొలగించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కవార్ధా జిల్లా నుండి ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అయింది. అక్కడ ఒక ముస్లిం గుంపు కాషాయ రంగు జెండాను ఓ స్తంభం నుంచి తొలగించి, చింపివేసింది. తర్వాత ఘర్షణలతో రాళ్లదాడికి దిగింది. అక్కడి గల రెండు గ్రూపులు తమ మత జెండాను చౌక్‌లో ఏర్పాటు చేయాలని భావించడంతో ఘర్షణకు దారితీసింది. హిందూ దేవుడైన శ్రీకృష్ణుని సంరక్షణ కోసం గౌరవించే ‘మా కర్మ చౌక్‌’లో ఈ సంఘటన జరిగింది.

చౌక్‌లో ఎల్లప్పుడూ హిందూ జెండా ఎగురుతుండేది. అయితే, ముస్లిం సమూహం వారి మత జెండాను కూడా ఏర్పాటు చేసింది. వీడియోలో, ఒక వ్యక్తి స్తంభాన్ని ఎక్కి, హిందూ జెండాను కూల్చివేయడం, చింపివేయడం, అవమానించడం కనిపించింది.

రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని శాంతి, సామరస్యాన్ని కాపాడటానికి చౌక్‌ నుండి మత జెండాలను తీసివేయమని పోలీసులు ఆదివారం ప్రజలతో ‘శాంతి సమితి’ సమావేశం నిర్వహించారు. ‘సమూహాలు కూడా దీనికి అంగీకరించాయి, అయితే, ఇరువైపుల నుండి కొంతమంది యువకులు తరువాత ఆ స్థలం వద్దకు చేరుకుని గందరగోళాన్ని సృష్టించారు’ అని పోలీసు అధికారి చెప్పారు.

  • 144 సెక్షన్‌

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సెక్షన్‌ 144 విధించారు. ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు. స్థానిక జర్నలిస్ట్‌ కథనం ప్రకారం… వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారి, ఘర్షణలకు దారితీసింది. తరువాత రాళ్ల దాడి జరిగింది. రెండు గ్రూపులకు చెందిన అజయ్‌ ఠాకూర్‌, షోయాబ్‌ అడ్రి, దుర్గేష్‌ దేవాంగన్‌ గాయపడ్డారు.

కలెక్టర్‌ రమేష్‌ శర్మ మాట్లాడుతూ.. ‘పరిస్థితిని అదుపులో ఉంచడానికి, ఉన్మాద సమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు తేలికపాటి శక్తిని ఉపయోగించాల్సి వచ్చింది. శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరూ హక్కు లేదు. మేము ఆ ప్రాంతంలో సెక్షన్‌ 144 అమలుతో సహా పరిస్థితిని నియంత్రణలో ఉంచాము, అన్ని ఇతర ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాము.. ఉద్రిక్తత తగ్గే వరకు పోలీసులు ఆ ప్రాంతంలో బందోబస్తు నిర్వహిస్తారు’ అని తెలిపారు. ఇదిలావుండగా, సీసీటీవీ ఫుటేజ్‌ని ఉపయోగించి దుండగులను గుర్తించే బాధ్యతను పోలీసులకు అప్పగించారు. ఈ ప్రాంతంలో అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.

Source: Opindia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి