
న్యూఢిల్లీ: పరాయి దేశమని కనీస జ్ఞానం, చట్టాలపై గౌరవం, భయం లేకుండా నైజీరియన్లు భారతదేశ రాజధాని ఢిల్లీలో బరితెగించి, ప్రవర్తించారు. ఏకంగా పోలీసులపైనే దాడికి పాల్పడ్డారు. కర్రలు, ఇటుకలతో దాడి చేసినందుకు నైజీరియన్లుగా భావిస్తున్న 53 మంది విదేశీ పౌరులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 27న, నైజీరియన్‌ల గుంపు మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి స్టేషన్, పోలీసు సిబ్బందిపై దాడి చేసింది. రాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు.
పోలీసులపై రాళ్లు రువ్విన తర్వాత, గుంపును చెదరగొట్టడానికి పోలీసులు గాలిలో కాల్పులు జరపాల్సి వచ్చిందని పలు మీడియా సంస్థలు తెలిపాయి. ఈ సమయంలో ఆ గుంపు పోలీసు స్టేషన్‌లోకి ప్రవేశించింది. స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడిరది. పోలీసు స్టేషన్‌లోకి గుంపు ప్రవేశించిన వెంటనే ఢిల్లీ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఎందుకు దాడి చేశారంటే…
రిపబ్లిక్ టీవీ నివేదిక ప్రకారం.. ఇటీవల ఓ నైజీరియన్ వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి పోలీసులు వైద్య పరీక్షను నిర్వహించాల్సి ఉంది. అయితే, ఇందుకు నైజీరియన్లు అంగీకరించలేదు. అటు తర్వాత మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ బయట విదేశీ జాతీయులు గుమిగూడి పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దాడి చేశారు. మరణించిన వ్యక్తి వైద్య పరీక్షకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పోలీసు సిబ్బందితో వాగ్వాదానికి నైజీరియన్లు దిగారు.
మాదకద్రవ్యాలతో ఢిల్లీలో అరెస్టయిన నైజీరియన్
ఎన్నో డ్రగ్స్ కేసుల్లో నైజీరియన్స్ పోలీసులకు అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు. ఒక నైజీరియన్ వ్యక్తిని ఇటీవల ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా.. అతడి దగ్గర రూ. 30 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయగా, నిందితుల్లో ఒకరు భారతదేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న నైజీరియన్ అని తేలింది. నైజీరియన్ జాతీయుడిని చిగోజీ ఫోస్టర్ అలియాస్ డేవిడ్‌గా గుర్తించారు. అతను 2019 జూలైలో ఆరు నెలల వ్యాపార వీసాపై దేశానికి వచ్చాడు.
అతని వీసా గడువు ముగిసిన తర్వాత కూడా డేవిడ్ నైజీరియాకు వెళ్లిపోలేదు. నైజీరియన్ ఢిల్లీలో నివసిస్తున్న ఆఫ్ఘన్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత తన సొంత నెట్‌వర్క్‌ను ప్రారంభించాడు. తన విచారణలో పంజాబ్ నుండి చాలా మంది తన నుండి డ్రగ్స్ కొనుగోలు చేస్తారని పోలీసుల విచారణలో వెల్లడిరచాడు. యూకే, శ్రీలంక, నేపాల్, యూఏఈ, ఇతర దేశాలకు డ్రగ్స్‌ను పంపడానికి అతను నకిలీ గుర్తింపులను ఉపయోగించాడని తెలుస్తోంది.
Source: Nationalist Hub





