News

కాబూల్‌లో పర్యటించిన చైనా, పాక్‌, రష్యా ప్రతినిధులు

646views

కాబూల్‌: తాలిబన్లతో సత్సంబంధాలు కొనసాగించేందుకు చైనా, రష్యా, పాకిస్థాన్‌ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ దేశాలకు చెందిన ప్రత్యేక రాయబారులు మంగళ, బుధవారాల్లో కాబుల్‌లో పర్యటించారు. అఫ్గాన్‌ తాత్కాలిక ప్రధానమంత్రి మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌, విదేశాంగ మంత్రి ఆమీర్‌ఖాన్‌ ముత్తకీ, విదేశాంగ మంత్రి, ఇతర తాలిబన్‌ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.

ప్రభుత్వంలో ఇతర వర్గాలను భాగస్వాములుగా చేసుకోవడం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రaావో లిజియాన్‌ బుధవారం విలేఖర్ల సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్ల‌డించారు. సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, మానవ హక్కుల పరిరక్షణ, ఆర్థిక పరిస్థితులపై వారు చర్చలు జరిపినట్టు లిజియాన్‌ తెలిపారు. అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్టాయ్‌, గత ప్రభుత్వంలోని మరో కీలక నేత అబ్బుల్లా అబ్బుల్లాలతోనూ మూడు దేశాల ప్రత్యేక రాయబారులు భేటీ అయ్యారని వెల్ల‌డించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి