
-
పాక్‌పై మండిపడ్డ భారత్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్(యుఎన్‌హెచ్‌ఆర్‌సీ) వద్ద కాశ్మీర్ సమస్యను లేవనెత్తినందుకు పాకిస్థాన్‌తో పాటు ఇస్లామిక్ సహకార సంస్థ(ఓఐసీ)పై భారత్ బుధవారం విరుచుకుపడిరది. ఐరాస నిషేధిత గ్రూపులతో సహా ఉగ్రవాదులకు పాకిస్థాన్ బహిరంగంగా మద్దతు ఇస్తోంది.. ఆర్థికసాయం అందిస్తోందని భారతదేశం ప్రతినిధి పవన్ బాధే యుఎన్‌హెచ్‌ఆర్‌సీ వద్ద పేర్కొన్నారు.
సిక్కులు, హిందువులు, క్రైస్తవులు, అహ్మదీయాలతో సహా వేలాది మంది మహిళలు, బాలికలు పాకిస్తాన్‌లో అపహరణలు, బలవంతపు వివాహాలు, మతమార్పిడులకు గురయ్యారని భారతదేశం తెలిపింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద, ‘బలమైన శక్తివంతమైన’ ప్రజాస్వామ్యం దేశమని… పాకిస్తాన్ వంటి విఫలమైన దేశం నుండి పాఠాలు నేర్చుకోవాల్సి అగత్యం మాకు లేదని భారత ప్రతినిధి బృందం యుఎన్‌హెచ్‌ఆర్‌సీ వద్ద పేర్కొంది.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మసూద్ ఖురేషి 131 పేజీల దస్తావేజును విడుదల చేసిన కొన్ని రోజుల తర్వాత నకిలీ ఎన్‌కౌంటర్‌లు, చట్టవిరుద్ధమైన హత్యలకు భారతదేశం పాల్పడుతోందని పాక్ పేర్కొంది. అంతేకాకుండా, జమ్మూ కాశ్మీర్‌లో భారత ప్రభుత్వం దారుణానికి పాల్పడిరదని ఆరోపించింది. గుల్‌మార్గ్, రాయపూర్, జోధ్‌పూర్, చక్రత, అనుప్‌గఢ్, బికనీర్‌లలోని శిబిరాలలో భారత ప్రభుత్వం ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని కూడా ఆరోపించింది.
అంతకుముందు మంగళవారం, మానవ హక్కులపై యున్ హై కమిషనర్ మిచెల్ బాచెలెట్ మాట్లాడుతూ భారతదేశం యుఏపీఏని ఉపయోగించడంపై, జమ్మూ కశ్మీర్‌లో ఇంటర్నెట్ షట్‌డౌన్‌లపై విమర్శించారు. జెనీవాలో యున్ మానవ హక్కుల మండలి 48వ సెషన్‌లో బ్యాచిలెట్ తన ప్రారంభ ప్రకటనలో, ‘జర్నలిస్టులపై ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఒత్తిడికి’ వ్యతిరేకంగా, ‘భావ ప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకునేందుకు’ ప్రజలను నిర్బంధించడం కోసం కూడా మాట్లాడారు. కాగా, భారతదేశ అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించడానికి పాకిస్తాన్‌కు లోకస్ స్టాండీ లేదని, ఇండియా గట్టిగా చెప్పింది.
Source: Tv9(English), Organiser





