News

పీజీలో ఆర్‌ఎస్‌ఎస్‌, సిద్ధాంతకర్తల చరిత్ర అవసరం

1.1kviews
  • కన్నూర్‌ విశ్వవిద్యాలయం సిలబస్‌కు గవర్నర్‌ మొహమ్మద్‌ ఖాన్‌ మద్దతు

తిరువనంతపురం: విశ్వవిద్యాలయ స్థాయిలో పవిత్ర భారతావనికి అమూల్యమైన సేవలందించి, బలిదానమైన మహనీయుల చరిత్ర ఎంతో అవసరమని, ఈ పాఠ్యాంశాలు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపకరిస్తాయని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తూ… కన్నూర్‌ విశ్వవిద్యాలయం సిలబస్‌కు మద్దతు ఇచ్చారు.

కేరళలోని కన్నూర్‌ విశ్వవిద్యాలయం సిలబస్‌లో సావార్కర్‌, గోల్వాల్కర్‌ రచనలను ప్రవేశపెట్టింది. ఈ చర్యను కొన్ని దేశ వ్యతిరేక సంస్థలు, వ్యక్తులు నిరసించారు. దీంతో గవర్నర్‌ స్పందించారు. భిన్నత్వ భారతదేశంలో విద్యార్థులకు విభిన్న సిద్ధాంతాలను బోధించడంలో తప్పు లేదు. విద్యార్థులు నేర్చుకున్న తర్వాత చర్చల్లో పాల్గొనాలని ఆయన అన్నారు. దేశంలో ఉత్తమ విద్యార్థులు, పౌరులను కొంతమంది దేశ వ్యతిరేకులుగా తయారు చేయడం వల్ల పొంతన, సరైన అవగాహన లేని నిరసనలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.

భారతదేశం ఎల్లప్పుడూ వైవిధ్యభరితమైన భూమి అని, ప్రాచీన కాలం నుండి ప్రకృతిని అధ్యయనం చేయడానికి, పరిశీలించడానికి అలవాటుపడిరదని మర్చిపోవద్దని గవర్నర్‌ హితవు పలికారు. ఆర్‌ఎస్‌ఎస్‌, అదే సమయంలో సిద్ధాంతకర్తల పుస్తకాలు సమాజంలో గొప్ప ద్వేషాన్ని పెంపొందించలేదా అనే ప్రశ్నకు, ముందు అటువంటి పుస్తకాలను క్షుణ్ణంగా చదవండి… అర్థం చేసుకున్నాక విమర్శించేందుకు తయారుకండని అన్నారు.

విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ గోపీనాథ్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ సిలబస్‌కు వ్యతిరేకంగా కొన్ని సంస్థలు ఆందోళన పడినప్పటికీ, ఇందులో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేశారు. కోర్సులలో దేశంలోని విశ్వవిద్యాలయాల ప్రముఖ నాయకులపై వివిధ పుస్తకాలు ఉన్నాయి… సిలబస్‌లో సావర్కర్‌, గోల్వాల్కర్‌ కనిపించడంలో తప్పు లేదు… పుస్తకాల పేర్లతో పాటు వివరణాత్మక వివరణను అందించాల్సి ఉందని వైస్‌ ఛాన్సలర్‌ అన్నారు.

కాగా, సిలబస్‌ అధ్యయనం కోసం ఇద్దరు సభ్యుల కమిటీని నియమించారు. యూనివర్సిటీ వెలుపల నుండి ఇద్దరు వ్యక్తులు దీని కోసం నియామకమయ్యారు. కమిటీ ఐదు రోజుల్లో తన నివేదిక సమర్పించనుంది.

 

Source: Janmabhumi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి