News

తాలిబన్లు… మానవ రూపంలో ఉన్న రాక్షసులు!

1.5kviews
  • గర్భిణీ పోలీసు అధికారిణిని కాల్చి చంపిన వైనం

కాబుల్‌: ప్రపంచ దేశాల ఆందోళన, అఫ్గాన్‌ దేశ పౌరుల భయమే నిజమైంది. తాము మారిపోయిన తాలిబన్లమంటూ శాంతి వచనాలు వల్లెవేసిన ముష్కరులు.. చేతల్లో మాత్రం తమ సహజసిద్ధ అరాచకత్వాన్నే ప్రదర్శిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిపై తూటాల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఘోర్‌ ప్రావిన్స్‌లో ఓ మహిళా పోలీసు అధికారి ఇంటిపై తాలిబన్లు దాడి చేశారు. ఆమె గర్భిణీ అని కూడా కనికరించకుండా.. భర్త, పిల్లల కళ్లముందే ఆమెను కాల్చి చంపారు.

ఫిరోజ్‌కోప్‌ా ప్రాంతానికి చెందిన బాను నెగర్‌ గత అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వంలో జైలు అధికారిణిగా పనిచేశారు. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత గతంలో అఫ్గాన్‌ రక్షణదళంతో కలిసి పనిచేసినవారిపై ప్రతీకార దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఇంటింటా సోదాలు చేపట్టి మరి వారిపై దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత శనివారం రాత్రి బాను నెగర్‌ ఇంటిపై దాడి చేసిన తాలిబన్లు ఆమె కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు. ఆమె భర్త, పిల్లలు చూస్తుండగానే అతి దారుణంగా ఆమెను కాల్చి చంపేశారని అఫ్గాన్‌ జర్నలిస్టు ఒకరు ట్విటర్‌ ద్వారా వెల్లడిరచారు. బాను ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి కాగా.. పాలుతాగే వయసున్న చిన్నారికి తల్లి.

అయితే నెగర్‌ హత్యను తాలిబన్లు తోసిపుచ్చడం గమనార్హం. ‘పోలీసు అధికారిణి హత్య గురించి తెలిసింది. అయితే, తాలిబన్లు ఆమెను చంపలేదు. దీనిపై మా దర్యాప్తు కొనసాగుతోంది. వ్యక్తిగత కక్షల కారణంగా ఎవరైనా ఆమెను చంపి ఉండొచ్చు. గత ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసిన వారందరికీ మేం ఇప్పటికే క్షమాభిక్ష పెట్టేశాం’ అని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ చెప్పారు.

SOURCE: Eenadu, Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి