
686views
తాలిబన్ల అతి ప్రవర్తనకు 17 మంది బలయ్యారు! మరో 41 మంది గాయపడ్డారు. పంజ్‌షేర్‌లో పైచేయి సాధించామంటూ కొందరు తాలిబన్లు.. శుక్రవారం రాత్రి కాబుల్‌లో తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గాలిలోకి కాల్పులు జరిపారు. తుపాకులు గురితప్పడం వల్ల ప్రాణనష్టం జరిగిందని ‘టోలో టీవీ’ వెల్లడించింది.
అయితే.. ఈ ఘటనలో ఇద్దరు మాత్రమే మృతిచెందారని, మరో 12 మంది గాయపడ్డారని కాబుల్‌లోని, ఎమర్జెన్సీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాల్పుల ఘటనను తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ ఖండించారు. ఈ పద్ధతిని వెంటనే మానుకోవాలని, కాల్పులు జరపవద్దని క్షేత్రస్థాయి నేతలకు సూచించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





