News

చెరువులో దొరికిన దేవతామూర్తుల విగ్రహాలు

605views

చిత్తూరు జిల్లా పాకాల మండలం పెద్దగోర్పాడు గ్రామంలోని ఓ చెరువులో దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. చెరువులో చేపల కోసం మోటర్తో నీటిని తోడుతుండగా.. విగ్రహాలు కనిపించాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు.. విగ్రహాలతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కంచుతో తయారు చేసిన మూడు అడుగుల విష్ణుమూర్తి, శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ సమక్షంలో వివరాలను నమోదు చేసి ట్రెజరీకి తరలిస్తామని చెప్పారు. ఈ ఘటనపై పురావస్తుశాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.