News

రైల్వే ప్రయాణికులకు అందుబాటులోనికి రానున్న పాడ్ హోటళ్ళు… తొలిసారిగా ముంబై రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయనున్న ఐఆర్సీటీసీ

571views

ముంబయి సెంట్రల్లో ప్రయాణికుల కోసం అధునాతన ‘పాడ్ హోటల్’ ను నిర్మిస్తోంది భారత రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్​సీటీసీ). స్టేషన్​ మొదటి అంతస్తులోని రెండు నాన్​ ఏసీ గదులను జపాన్​ తరహా క్యాప్సుల్​ హోటల్​గా మారుస్తోంది. అందులో ప్రయాణికులకు రాత్రివేళ బస కల్పించడానికి మొత్తం 30 గదులుంటాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబరుకు నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ప్రైవేటు హోటళ్ల కన్నా చౌకగా, తగిన వసతులతో రాత్రి వేళ పూర్తి భద్రత కల్పించే విధంగా వీటిని రూపొందిస్తున్నట్లు ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు. “ఈ గదులను 12 గంటల పాటు అద్దెకు ఇస్తాం. మొత్తం రూ.1.80కోట్ల వ్యయంతో అధునాతన డిజైన్లతో నిర్మాణం జరిగింది. దీపావళి నాటికల్లా వీటిని అందుబాటులోకి తీసుకొస్తాం.” అని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.