News

ఒలింపిక్స్ లో హిందీ పాటతో ప్రదర్శన ఇచ్చిన ఇజ్రాయిల్ ఈతగాళ్లు.. భారత్ ఎప్పుడూ మా మిత్ర దేశమేనంటూ వెల్లడి

637views

టోక్యోలో ఒలింపిక్స్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బుధవారం జరిగిన సింక్రనైజింగ్‌ స్విమ్మింగ్‌ పోటీలో ఇజ్రాయెల్‌కు చెందిన స్విమ్మర్లు బాలీవుడ్‌ పాటతో ప్రదర్శన ఇచ్చారు. బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ ‘ఆజా నచ్‌లే’ చిత్రంలోని ఆజా నచ్‌లే పాటకు అనుగుణంగా ఇజ్రాయెల్‌ అథ్లెట్లు ఈడెన్‌ బ్లెచర్‌, షెల్లీ బాబ్రిస్కీ ఇద్దరూ జంటగా స్విమ్‌ చేసి ఆకట్టుకున్నారు. ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న భారతీయులు ఇజ్రాయెల్‌ అథ్లెట్లు బాలీవుడ్‌ పాటను ఎంచుకోవడం చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. బాలీవుడ్‌ పాటతో వారు చేస్తున్న ప్రదర్శనను వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.

ఇజ్రాయెల్‌ ఇన్‌ ఇండియా అనే ట్విటర్‌ పేజీ ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. “బాలీవుడ్‌ సినిమాలంటే ఇజ్రాయెల్ ‌కు ఎంతో ఇష్టం. మా ఒలింపిక్స్‌ స్విమ్మర్లు ‘ఆజా నచ్లా’ పాటతో పోటీలో పాల్గొనడమే అందుకు నిదర్శనం”అని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.