News

ఒలింపిక్స్‌లో సెమీస్ ‌కు చేరిన పివి సింధు

442views

త ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీపీ సింధు మరోసారి సెమీస్‌కు చేరింది. తాజాగా జరిగిన బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలోని క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆమె జపాన్‌ క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించింది. దాంతో మరోసారి భారత్‌కు పతకం ఖాయం చేసేలా కనిపిస్తోంది. తొలి గేమ్‌లో 21-13తో ఆధిపత్యం చెలాయించిన ఆమె రెండో గేమ్‌లోనూ సత్తా చాటింది. ఈసారి బ్రేక్‌ సమయానికి 11-6తో నిలిచిన సింధూ చివరికి 21-20 తేడాతో మ్యాచ్‌ను పూర్తి చేసింది. కాగా, రెండో గేమ్‌లో యమగుచి పోరాడేందుకు ప్రయత్నించినా సింధూ తన ఆధిపత్యం కొనసాగించింది. ఈ క్రమంలోనే రెండో గేమ్‌ను సొంతం చేసుకొని సెమీస్‌కు దూసుకెళ్లింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.