
319views
జమ్మూ కశ్మీర్‌లో నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటించనున్నారు. ఈ నెల 24 నుంచి 28 వరకు జమ్ము కశ్మీర్‌లో రాష్ట్రపతి పర్యటిస్తారని కేంద్రం తెలిపింది. పర్యటనలో భాగంగా జమ్ము, కశ్మీర్, లద్దాక్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 26న కార్గిల్ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించనున్నారు. 27న కశ్మీర్ విశ్వవిద్యాలయం 19వ స్నాతకోత్సవంలో ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
వాస్తవంగా 2019లోనే పర్యటించాల్సి ఉండగా వాతావరణం సహకరించక పర్యటన రద్దయ్యింది. జమ్మూ కశ్మీర్ విభజన అనంతరం రాష్ట్రపతి తొలిసారిగా పర్యటించనుండడం విశేషం.