
అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డిసిలో దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఆరేళ్ల బాలిక మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. వాషింగ్టన్ డిసి లోని ఆగ్నేయ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటీవ్ అసిస్టెంట్ చీఫ్ అషాన్ బెనెడిక్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా జనాలపై కాల్పులకు తెగబడ్డారు.
వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలానికి చేరుకోగా.. వారిపైనా కాల్పలుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. దుండగుల కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్క దుండగులు కూడా చిక్కలేదు. అనుమనితులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ వారు మాత్రం చిక్కడం లేదు. దాంతో అధికారులు.. స్థానిక ప్రజల సహాయ సహకారాలు కోరుతున్నారు. ఈ కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్రవాద దాడులేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





