
409views
భారత అంతర్గత వ్యవహారాల్లో పాక్ మళ్లీ తలదూర్చింది. జమ్ముకశ్మీర్ నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన సమావేశంపై తన అక్కసు వెళ్ళబోసింది. ఈ భేటీ ‘ఓ పెద్ద డ్రామా’ అని, పబ్లిసిటీ సమావేశమని వ్యాఖ్యానించింది.
ప్రధాని నిర్వహించిన సమావేశానికి ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్(ఏపీహెచ్సీ)ను ఆహ్వానించలేదని పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషీ పేర్కొన్నారు. కశ్మీర్లో జనాభాపరంగా మార్పులు తీసుకువచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. భారత్తో బ్యాక్ డోర్ దౌత్యవిధానాన్ని తాము అనుసరించటం లేదని స్పష్టం చేశారు.





