News

పాక్ లో గణనీయంగా పెరిగిన ద్రవ్యోల్బణం… భారత్ నుండి దిగుమతులు లేకపోవడమే కారణం..

445views

పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణ రేటు 12 శాతానికి చేరుకుంది. చక్కెర ధర కిలోకు 110 రూపాయల వరకు, రంజాన్ సందర్భంగా పిండి కిలోకు రూ .96 వరకు పెరిగింది. ఆగస్టు 2019 కి ముందు, ద్రవ్యోల్బణం ఇంత దారుణంగా లేదు. ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్ కు అవసరమైన చాలా వస్తువులు భారతదేశం నుండి కొనుగోలు చేసేవారు. 5 ఆగస్టు 2019 న, భారతదేశం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఎ లను కాశ్మీర్ నుండి తొలగించడంతో ఇమ్రాన్ ఖాన్ భారతదేశం నుండి అన్నిరకాల దిగుమతులను నిషేధించారు. అయితే, తరువాత పాకిస్తాన్ లో తీవ్రంగా మందుల కొరత వచ్చింది. అక్కడ రెండు రూపాయల టాబ్లెట్ ధర 20 రూపాయలకు చేరిపోయింది. దీంతో మందుల దిగుమతి పై నిషేధం సడలించారు. అది ఇప్పటికే కొనసాగుతోంది. అదేవిధంగా మిగిలిన దిగుమతులపై విధించిన నిషేధం అలాగే కొనసాగుతోంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.