News

కరోనా పాపం చైనాదేనని నేనప్పుడే చెప్పాగా? – ట్రంప్‌‌

505views

చైనాపై మరోసారి విరుచుకుపడ్డారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వచ్చిందని తాను ముందే చెప్పానని అన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్‌ పుట్టుక గురించి తాను చెప్పిందే నిజమైందంటున్నారు అన్నారు. చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లోనే ఈ వైరస్‌ను సృష్టించారంటూ ఇటీవల పలు అధ్యయనాలు పేర్కొంటున్న విషయం తెలిసిందే.

ఈ పరిశోధనలపై స్పందించిన ట్రంప్‌.. తాజాగా ఈ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న వైరస్ జాడ చైనాలోనే ఉందని.. యావత్‌ ప్రపంచానికి చైనా భారీ మూల్యం చెల్లించాలని మండిపడ్డారు.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టి ఏడాది గడిచినా ఇంకా దాని జన్మస్థలంపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. ఈ వైరస్‌ను చైనానే సృష్టించిందని, ఇది కుంగ్‌ ఫూ వైరస్‌ అని ట్రంప్‌ గతేడాదే ప్రకటించారు. అయితే ఆయన ఆరోపణలకు ఆధారాలు లేవని శాస్త్రవేత్తలతో పాటు అమెరికా గూఢఛారి సంస్థలు అప్పట్లో వాదించాయి.

ఈ విషయం తాత్కాలికంగా మరుగున పడినా.. ఇటీవల మళ్లీ చైనా కుట్రకోణం తెరపైకి వచ్చింది. ఈ వైరస్‌ చైనా సృష్టే అని, జీవాయుధంగా మార్చేందుకు డ్రాగన్‌ చేసిన పరిశోధనల ఫలితమే ఈ కోవిడ్ విలయమని ఇటీవల బ్రిటన్‌ సహా పలు దేశాలు చేసిన పరిశోధనల్లో తేలింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.