News

సక్షమ్ ఆద్వర్యంలో హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తుల కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్లు మరియు కుర్చీల వితరణ

441views

మాజీ పారా మిలిటరీ ఉద్యోగి, RSS వింజమూరు నగర సంపర్క ప్రముఖ్ శ్రీ నోటి మాల్యాద్రి రెడ్డి గారి మనవరాలు చిరంజీవి మధు పూర్ణిమ 5వ జన్మదినోత్సవం సందర్భంగా కడనూతల జాతీయ రహదారి పక్కన ఉన్న భవాని ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారిచే నిర్వహిస్తున్న హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తుల మరియు అనాధ పిల్లల శరణాలయానికి సక్షమ్ అఖిల భారత ప్రచార విభాగం సభ్యులు మరియు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ జాతీయ నిధి పర్యవేక్షణ కమిటీ సభ్యులు శ్రీ వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి గారి చేతుల మీదుగా 5 సీలింగ్ ఫ్యాన్లు, 5 కుర్చీలు మరియు కేంద్రానికి అవసరమైన కేబుల్ వైర్ ను అందజేశారు. అనంతరం కేంద్రంలో ఉంటున్న వారందరికీ పండ్లూ, స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన కుటుంబాలలో నిర్వహించుకునే శుభకార్యాల సందర్భంగా ఇటువంటి అభాగ్యులకు సహాయం చేయటం మంచి సాంప్రదాయమని, ఈరోజు ఇక్కడ ఉండే శరణార్ధులందరూ సౌకర్యవంతంగా నివసించేందుకు కేంద్రానికి అవసరమయిన మౌలిక వస్తువులు సమకూర్చిన శ్రీ నోటి మాల్యాద్రి రెడ్డి గారి దాతృత్వం ప్రశంసనీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మన ఇంట్లో జరిగే శుభ సందర్భాలను ఇలాంటి మంచి మంచి సేవా కార్యక్రమాలతో జరుపుకొని అభాగ్యులకు ఆపన్న హస్తం అందించాలని పిలుపునిచ్చారు. పిల్లలు ఎవరూ కూడా అధైర్య పడకుండా మనోధైర్యంతో ముందుకు సాగాలని దాతల సహాయాన్ని ఉపయోగించుకొని ప్రయోజకులుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మనం ఫౌండేషన్ వ్యవస్థాపకులు హరీష్, ఐ కేర్ మిషన్ వ్యవస్థాపక సభ్యులు వడ్డే శ్రీనాథ్ రెడ్డి, యువన్ రెడ్డి, సంస్థ నిర్వాహకులు సింహాద్రి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.