
791views
కొత్త ప్రైవసీ విధానాన్ని అంగీకరించాల్సిందిగా వాట్సాప్ తన వినియోగదారులను తీవ్రస్థాయిలో బలవంతం చేస్తోందని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు చట్టమయ్యేలోగా రోజూ నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు ఇస్తూ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని కేంద్రం పేర్కొంది. వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై కేంద్రం తాజాగా అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. కొత్త ప్రైవసీ పాలసీపై ఇలా కస్టమర్లకు నోటిఫికేషన్లు ఇవ్వడం మానుకునేలా వాట్సా్‌పను ఆదేశించాలని కేంద్రం కోర్టును కోరింది. కాగా, తమ ప్రైవసీ విధానాన్ని అంగీకరించని వినియోగదారులను తొలగించబోమని వాట్సాప్ తెలిపింది. అయితే కొత్త నిబంధనలు వివరిస్తూ వారికి నోటిఫికేషన్లు పంపుతూనే ఉంటామని ఆ సంస్థ పేర్కొంది.





