
417views
వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని భారత్ పేర్కొంది. చైనా బలగాలను ఉపసంహరించకపోగా.. పెంచుతోందని భారత్ ఆరోపించింది. బలగాల ఉపసంహరణ ప్రక్రియ త్వరగా పూర్తయితే తూర్పు లద్ధాఖ్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఉపసంహరణ సాధ్యమవుతుందని చెప్పింది. దీంతో సరిహద్దులో శాంతి పునురుద్ధరణ సాధ్యమవుతుందని తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంబడి.. ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద చైనా బలగాలను పెంచటం, మౌలిక వసతుల నిర్మాణానికి సంబంధించి విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ విధంగా స్పందించారు.
సెప్టెంబర్ 10 న మాస్కోలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భేటీ అయ్యారు. తూర్పు లడ్డాఖ్లో ప్రతిష్టంభనకు తెరదించేలా.. ఐదు అంశాల ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఇరు దేశాల నేతలు అంగీకరించినా..చైనా ఆ దిశగా చర్యలు ప్రారంభించలేదు.





