News

ఛత్తీస్ గఢ్ : నక్సల్స్ దాడిలో జవాన్లు మృతి : ఏమీ పట్టనట్టు అస్సాం ఎన్నికల ప్రచారంలో బిజీగా సీఎం : నెటిజన్ల ఆగ్రహం

860views

త్తీస్ ఘడ్ లో ఒకవైపు నక్సలైట్ల దాడిలో 20 మందికి పైగా జవాన్లు కోల్పోయిన వార్తలతో దేశ ప్రజలందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ ఉంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ మాత్రం జరిగిన దారుణం తో తనకేం సంబంధం లేదన్నట్టు అస్సాం ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడంలో మునిగిపోయి ఉండడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తన సొంత రాష్ట్రం ఛత్తీస్ ఘడ్ లో పదుల సంఖ్యలో జవాన్లు మృతి చెంది కొన్ని గంటలు గడుస్తూ ఉన్నా ఆయన ఇప్పటివరకూ చత్తీస్గడ్ చేరుకోలేదు. “ఆదివారం ఉదయం తనకు హోంమంత్రి అమిత్ షా నుంచి పిలుపు వచ్చిందని, ఆదివారం సాయంత్రానికి తాను చత్తీస్గడ్ చేరుకుంటానని ఆయనే స్వయంగా వెల్లడించారు.

తన రాష్ట్రంలో ఇంత మారణహోమం జరుగుతూ ఉన్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి తిరిగి రావడానికి ఇష్టపడకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తన రాష్ట్రంలో అంత మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ మాత్రం ఎంతో దూరంలో అస్సాం ఎన్నికల ప్రచారంలో ఉన్నారని జితేంద్ర శర్మ అనే ఓ నెటిజన్ విమర్శించారు. అలాగే అస్సాంలో ప్రచారం చేస్తున్నందుకు చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ పై ప్రశంసలు కురిపిస్తూ వార్తలు వ్రాయడంలో బిజీగా ఉన్న జర్నలిస్టులను కూడా ప్రజలు దుయ్యబడుతున్నారు.

చత్తీస్గడ్ సీఎంపై బిజెపి కూడా విమర్శలు గుప్పించింది. మంగల్దోయికి చెందిన బిజెపి ఎంపీ దిలీప్ సైకియా మాట్లాడుతూ ” తన సొంత రాష్ట్రంలో ఇంత మంది భద్రతా సిబ్బంది దారుణంగా ప్రాణాలు కోల్పోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ మాత్రం బాధ్యత లేకుండా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయి ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ సిబ్బందితో క్యాంపు చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం దర్యాప్తు చేయాలి.” అని డిమాండ్ చేశారు.

జవాన్లను చిత్రహింసలు పెట్టి చంపిన నక్సల్స్

చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో 30 మందికి పైగా జవాన్లు గాయపడ్డారు.

ప్రాణాలతో లభించిన జవాన్లను నక్సలైట్లు చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. మరికొంతమంది దీన స్థితిలో మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మృతిచెందిన కొందరు జవాన్ల వద్ద లభించిన ఆయుధాలు, తుపాకులు, బులెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, బూట్లతో నక్సల్స్‌ పరారయ్యారని వివరించారు. బులెట్‌ దెబ్బలు తగిలి కదల్లేని స్థితిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ జవాను చేయి నరికి పాశవికంగా హత్య చేసినట్లు తెలిపారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.