NewsProgramms

దేశ రాజధానిలో సంస్కార భారతి ప్రధాన కార్యాలయం ‘కళా సంకుల్’ నిర్మాణం ప్రారంభం

382views

దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా నిర్మించిన సంస్కార భారతి కార్యాలయం ‘కళా సంకుల్’ ను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ప్రారంభించారు.

ప్రఖ్యాత థియేటర్ మరియు ఫిల్మ్ పర్సనాలిటీ మరియు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్, ప్రముఖ సినీ నటుడు శ్రీ పరేష్ రావల్ (ఆయనకు కోవిడ్ పాజిటివ్) ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆన్‌ లైన్ మోడ్ ద్వారా అధ్యక్షత వహించారు. సంస్కార భారతి పోషకుడు బాబా యోగేంద్ర జీ కూడా హాజరయ్యారు.

ప్రారంభంలో, ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే దీపం వెలిగించి కొబ్బరికాయ పగలగొట్టి ‘కళా సంకుల్’ ను ప్రారంభించారు. ‘కళా సంకుల్’ వద్ద ఫ్రేమ్ చేసి భద్రపరచడానికి ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ యొక్క చేతి ముద్రలు తీసుకున్నారు. ప్రముఖ కళాకారులు మాలిని అవస్థీ, అనూప్ జలోటా, అన్వర్ అలీ ఖాన్, సుగంధ శర్మ, వసీఫుద్దీన్ డాగర్, పండిట్ ధర్మనాథ్ మిశ్రా మరియు పండిట్ రామ్ ‌కుమార్ మిశ్రా ఎంతో ఆకట్టుకునే ‘రాగాదేశ్’ ప్రదర్శించారు. ఒక డాక్యుమెంటరీ ద్వారా సంస్కార భారతి నాలుగు దశాబ్దాల ప్రస్థానాన్ని, ‘కళా సంకుల్’ యొక్క ప్లాన్ ను సభికులకు ప్రదర్శించారు.

ఆర్‌ఎస్‌ఎస్ మాజీ సర్ కార్యవాహ భయాజీ జోషి, ప్రస్తుత సహ సర్ కార్యవాహ డాక్టర్ మన్మోహన్ వైద్య మరియు అరుణ్ కుమార్, అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రాం‌లాల్, సీనియర్ సంఘ ప్రచారక్ ఇంద్రేష్ కుమార్, ప్రగ్యా ప్రవాహ్ జాతీయ కన్వీనర్ జె. నంద ‌కుమార్, కేంద్ర సమాచార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) కిరెన్ రిజిజు, రాజ్యసభ ఎంపి మరియు ప్రఖ్యాత కళాకారిణి పద్మ విభూషణ్ డాక్టర్ సోనాల్ మాన్సింగ్, జానపద గాయకుడు పద్మ విభూషణ్ తీజన్ బాయి, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్స్ ప్రెసిడెంట్ మరియు ప్రసిద్ధ శిల్పి అద్వైత్ గడనాయక్, రచయిత పద్మశ్రీ నరేంద్ర కోహ్లీ, మణిపురి నర్తకి పద్మభూషణ్ రాజ్‌కుమార్ సింహాజిత్ సింగ్ మరియు పద్మభూషణ్ గాయకుడు పండిట్ రాజన్ మిశ్రా మరియు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యూ ఢిల్లీలోని దీన్‌దయాల్ ఉపాధ్యాయ మార్గ్‌లో ఉన్న సంస్కార భారతి యొక్క కొత్త ప్రధాన కార్యాలయం కళా సంకుల్. కళ మరియు సాంస్కృతిక కార్యకలాపాలకు అంకితమైన ఒక సముదాయంగానూ మరియు కళ మరియు సాంస్కృతిక గ్రంధాలు, ఆర్ట్ గ్యాలరీ, ఆడిటోరియం, స్టూడియో, మరియు సమావేశ గదులు ఇలా…. దేశంలోని ప్రఖ్యాత కళా, సాంస్కృతిక కార్యక్రమాల కేంద్రంగా అవతరించబోతోంది కళా సంకుల్.

Source : VSK BHARAT

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.