News

ఐసిస్ బెంగళూరు కేసులో అహ్మద్ అబ్దుల్ ఖాదర్, ఇర్ఫాన్ నాసిర్‌లపై ఎన్‌ఐఏ ఛార్జి‌షీట్

576views

పీసీలోని సెక్షన్ 120B, 125 మరియు యు ఏ పి ఏ చట్టంలోని 17, 18, 18 B సెక్షన్ ల ప్రకారం బెంగళూరులోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అనుమతితో వారిపై ఛార్జిషీటు దాఖలైంది. నిందితులు ఇరువురు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో చురుకుగా పాలు పంచుకుంటున్నారని, ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం, వారికి శిక్షణ ఇప్పించడం తో పాటు వారు సిరియా వెళ్లడానికి అవసరమైన నిధులు సమకూర్చడం వంటి కార్యకలాపాలకు పాల్పడ్డారని NIA పేర్కొంది.

ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ కేసులో డాక్టర్ అబ్దుర్ రెహ్మాన్ ను విచారించిన తరువాత ఈ కేసును ఎన్ఐఏ 19.09.2020 న నమోదు చేసింది. ఇతను నిందితుల ప్రేరణతో ఐసిస్‌లో చేరడానికి 2013-14లో సిరియాకు వెళ్ళాడు. NIA అధికారులు తమ శైలిలో విచారించడంతో అబ్దుల్ అనేక విషయాలను వెల్లడించాడు. దాంతో బెంగళూరు నుండి ఐసిస్ కు ముస్లిం యువతను పంపడానికి, వారికి అవసరమైన నిధులను సమకూర్చడానికి కారణమైన వివిధ వ్యక్తుల పేర్లు వెలువడ్డాయి. హిజ్బ్-ఉట్-తహ్రీర్ (అంతర్జాతీయ పాన్-ఇస్లామిస్ట్ మరియు ఫండమెంటలిస్ట్ సంస్థ) లో సభ్యులైన అహ్మద్ అబ్దుల్ ఖాదర్, ఇర్ఫాన్ నాసిర్ మరియు వారి సహచరులు వారి ఐసిస్ సంబంధిత కార్యకలాపాలను మరింతగా పెంచడానికి “ఖురాన్ సర్కిల్” అనే సమూహాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా వెల్లడైంది

విచారణ సమయంలో ఖురాన్ సర్కిల్ సభ్యులు అందించిన సమాచారం ఆధారంగానూ, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వివిధ డిజిటల్ పరికరాల ఫోరెన్సిక్ పరీక్ష ఆధారంగా, విదేశాలలో మరియు భారతదేశంలో ఉన్న వివిధ నిందితులు / అనుమానితుల పాత్రలు బయటపడ్డాయి, ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.