News

75సంవత్సరాల స్వాతంత్ర వేడుకల సన్నాహాల ప్రారంభం

430views

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2022 ఆగస్టు 15 కి 75 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని  దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.  ఈ సందర్భంగా మార్చి6వ  తేదీ నాడు 259 సభ్యులతోకూడిన  ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వతంత్రపోరాటంలో మైలు రాయిగా నిలిచిన  ఉప్పు సత్యాగ్రహం జరిగి 91 సంవత్సరాలు పూర్తయిన రోజున అంటే 12 మార్చ్  2021 న లాంఛనంగా కార్యక్రమాలు ప్రారంభించాలని భావిస్తున్నారు.

ఈ కార్యక్రమాలు జాతీయ,  అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నది.  ఈ కమిటీలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు,  ప్రముఖ కళాకారులు,  ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ  బొబ్దే మరియు అజిత్  ధోవల్,  28 మంది ముఖ్యమంత్రులు,  నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ , మాజీ కేంద్రమంత్రి  బిజెపి సీనియర్ నాయకుడు శ్రీ ఎల్ కే అద్వానీ,  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,  హెచ్.డి.దేవెగౌడ,  కాంగ్రెస్ చీఫ్ సోనియా,  సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి,  ములాయం సింగ్,  శరద్ పవార్ లాంటి అనేకమంది ప్రముఖులు ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీకి ప్రధాని మోడీ నాయకత్వం వహిస్తారు

ఈరోజు అంటే 2021 మార్చ్ 8న ఈ రెండు వందల యాభై తొమ్మిది మంది కమిటీ సభ్యులతో మొదటి సమావేశం ఢిల్లీలో  జరుగుతున్నది,  ఆ సమావేశానంతరం భవిష్యత్ కార్యక్రమాలను ప్రకటిస్తారు .

Source : News Bharathiyam

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.