
556views
రాజస్థాన్‌లోని కోటాలో కృషి విజ్ఞాన కేంద్రం మహిళా సిబ్బంది వెల్లుల్లితో మాత్రలు తయారు చేస్తున్నారు. 500, 1000 మిలీగ్రాములుగా ఆన్‌లైన్‌లో లభించే వీటికి ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ఔషధ గుణాలు ఉన్న వెల్లుల్లి ద్వారా కీళ్ల నొప్పులు, బ్లడ్ కొలెస్టాల్ర్ వంటి జబ్బులు నివారించవచ్చని, చర్మ సౌందర్యానికి ఎంతో మేలని కృషి విజ్ఞాన్ కేంద్రంలో సేవలందించే డాక్టర్ మమతా తివారీ తెలిపారు. ఎండపెట్టిన వెల్లుల్లిని వలిచి వాటిని పొడి చేస్తామని సిబ్బంది తెలిపారు. కేజీ వెల్లుల్లితో 100 గ్రాముల పౌడర్ తయారవుతోందని, ఈ మాత్రల తయారీకి 10 రోజుల సమయం పడుతుందని చెప్పారు. వెల్లుల్లి వాసనకు విరుగుడుగా అందులో జంతు పదార్థాల నుంచి సేకరించే ప్రొటీన్ (యానిమల్ జెలాటిన్), బియ్యం పొట్టు ఉపయోగిస్తున్నామని వివరించారు.





