News

లష్కరే ముస్తఫా ఉగ్ర నాయకుడి అరెస్టు

458views

మ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌కు చెందిన లష్కరే ముస్తఫా ఉగ్రవాద సంస్థ నాయకుడు హిదయతుల్లా మాలిక్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జమ్మూ, అనంతనాగ్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్‌ పోలీసు అధికారి శ్రీధర్‌ పాటిల్‌ వెల్లడించారు. ‘జమ్మూలోని కుంజ్వానీ ప్రాంతంలో లష్కరే ముస్తాఫా ఉగ్ర సంస్థ నాయకుడు హిదయతుల్లా మాలిక్ ‌ను అరెస్టు చేశాం. అతడి వద్ద నుంచి పిస్టల్‌, గ్రనేడ్‌ ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపై మాలిక్‌ దాడికి తెగబడ్డాడు’ అని పాటిల్‌ తెలిపారు. ఈ లష్కరే ముస్తఫా ఉగ్రవాద సంస్థ జమ్మూకశ్మీర్‌లో పాక్ ‌కు చెందిన జైషే మహమ్మద్ ‌కు అనుబంధ శాఖలా పనిచేస్తోందని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.