
1.3kviews
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మందుపాతర పేల్చి 15 మందిని హత్య చేశారు. సెంట్రల్ ప్రావిన్స్‌లోని దేకుండి ప్రాంతంలో మందుపాతర పేల్చి 15 మంది అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి తారిక్ అరియన్ మంగళవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. బాధితుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై తాలిబన్లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అఫ్గాన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్న క్రమంలోనే మిలిటెంట్లు తమ దురాగతాలను కొనసాగిస్తున్నారు.





