News

సంస్కార భారతి ఆధ్వర్యంలో చిత్ర కళా పోటీలు

1.4kviews

ప్రముఖ సినీ దర్శకుడు స్వర్గీయ బాపు గారి వర్థంతి సందర్భంగా సంస్కార భారతి, ఆంధ్రప్రదేశ్ వారు “బాపు” రే చిత్రం పేరుతో చిత్ర కళా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో విభాగం – 1 లో 10 నుంచి 15 సంవత్సరాల వయసు బాల బాలికలు బాపు గారు గీసిన ‘బుడుగు’ బొమ్మను గీసి samskarabudugu@gmail.com కు మెయిల్ చెయ్యవలసిందిగా నిర్వాహకులు తెలియజేశారు. అలాగే విభాగం – 2 లో 16 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నవారు బాపు గారు గీసిన ఏదైనా ‘యువతి’ బొమ్మను గీసి samskarabomma@gmail.com కు ఈమెయిల్ చెయ్యాలి. విభాగం – 3 లో 26 సంవత్సరాల వయసు పైబడిన వారు బాపు గారు గీసిన ‘రామాయణానికి సంబంధించిన’ బొమ్మ గీసి bapusrirama@gmail.com కు మెయిల్ చెయ్యాలి. పోటీలో పాల్గొను అభ్యర్థులు తాము గీసిన చిత్రంతో పాటుగా తమ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్ కూడా పంపాలి. చిత్రాలను పంపడానికి ఆఖరు తేదీ ఆగస్టు 27 గురువారం.

ఆగస్టు 31 సోమవారం నాడు ఫేస్బుక్ లైవ్ లో జరిగే కార్యక్రమంలో విజేతలను ప్రకటిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఆ కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారులు శ్రీ అల్లు రాంబాబు గారిచే చిత్రకళార్చన (చిత్ర కళా ప్రదర్శన) కూడా ఉంటుంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.