
కన్యాకుమారిలో వివేకానంద స్మారకం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వివేకానంద రాక్ మెమోరయల్ మరియు వివేకానంద కేంద్ర, కన్యాకుమారి వారు ఈ ఏడాది సెప్టెంబర్ 12న సాయంత్రం 6.30 నుంచి 7.45 వరకు “ఆత్మనిర్భర్ భారత్ మరియు ఈశాన్య భారతం” అనే అంశంపై ఒక వెబినార్ (ఆన్ లైన్ సమావేశం) నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వివేకానంద రాక్ మెమోరియల్ మరియు వివేకానంద కేంద్ర ఉపాధ్యక్షురాలు నివేదితా భిడే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ ఎస్. గురుమూర్తి పాల్గొంటారు. భారత్ లో నివసించేవారెవరైనా ఈ వెబినార్ లో పాల్గొనదలిస్తే వారు కేవలం వంద రూపాయల ప్రవేశ రుసుము చెల్లించి ముందుగా తమ పేరు, వివరాలను నమోదు చేసుకోవలసిందిగా నిర్వాహకులు తెలియజేశారు. అలాగే విదేశాలలో ఉండేవారు పది US డాలర్లు చెల్లించి తమ పేరును ముందుగానే రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. రిజిస్టర్ చేసుకోదలచిన వారు https://necalling.vrmvk.org అనే వెబ్ లింక్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వెబినార్ లో పాల్గొనడానికి అవసరమైన లింక్ రిజిస్టర్ అయిన అభ్యర్ధులకు మాత్రమే మెయిల్ ద్వారా తెలుపబడుతుందని కూడా నిర్వాహకులు తెలిపారు.






