
588views
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ వ్యవహార శైలిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ గొగొయ్ తీరుపై ఈ వ్యాజ్యం దాఖలైంది. గత రెండేళ్లుగా వాదనల కోసం ఎందుకు అడగలేదని పిటిషనర్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జస్టిస్ గొగొయ్ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేశారని, అందువల్ల ఈ వ్యాజ్యం చెల్లదని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్ దురుద్దేశ పూరితమైందని కోర్టు అభిప్రాయపడింది.





