News

రావణ జన్మ భూమిలో ‘జైశ్రీరాం’ నినాదాలు

977views

యోధ్యలో నేడు రామమందిర భూమిపూజ కార్యక్రమం జరుగనున్న నేపథ్యంలో దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. కాగా, రావణాసురుడి జన్మస్థలంగా భావించే ఓ కుగ్రామంలో కూడా ఈ సంబరాలు జరుపుకోవడం విశేషం. నోయిడాకు సమీపంలోని ఓ కుగ్రామం బిస్రాఖ్‌. అది రావణాసురుడి జన్మ స్థలమని స్థానికుల నమ్మకం. కాగా, అయోధ్యలో శ్రీరామ మందిరం భూమిపూజ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ కూడా ఉత్సవాలు జరుపుకొంటున్నారు.

దసరా నవరాత్రుల్లో దేశమంతా సంబరాలు చేసుకుంటే ఇక్కడ మాత్రం సంతాప దినాలుగా పాటిస్తారు. ఆ సమయంలో సంబరాలు జరుపుకుంటే రావణుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని వారు భయపడతారు. ఇక్కడున్న రావణ మందిరంలో రావణుడి విగ్రహంతో పాటు, శివ, పార్వతి, కుబేరుల విగ్రహాలున్నాయి. ఈ మందిరం రాత్రి వేళలో కూడా తెరిచే ఉంటుంది. ఇక్కడికి వచ్చేవారిలో చాలామంది రావణుడికి పూజలు నిర్వహిస్తారట.
”అసలు రాముడు లేకుంటే రావణుడు లేడు.. అలాగే రావణుడు లేకుంటే రాముడూ లేడు. అందుకే అయోధ్యలో భూమిపూజ సందర్భంగా మిఠాయిలు పంచుతున్నాం’ అని ఇక్కడి రావణ మందిర పూజారి మహంత్‌ రామ్‌దాస్‌ తెలిపారు. ఈ ప్రాంతంలో ‘జై శ్రీరాం’ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.