News

యూపీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్ట్‌

803views

కాన్పూర్లో 8మంది పోలీసులను కాల్చివేసిన ఘటనలో ప్రధాననిందితుడైన వికాస్ దూబే ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వారం రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న వికాస్ దూబేను మధ్యప్రదేశ్ ఉజ్జయిన్‌లోని ఓ గుడివద్ద నేటి ఉదయం అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో అతని ఇద్దరు ప్రధాన అనుచరులు ఎన్‌కౌంటర్‌లో మరణించిన సమయంలోనే వికాస్ దూబేను అరెస్టు చేసినట్లు సమాచారం.

ఉజ్జయిన్‌లోని ఓ ఆలయంలో మాస్కుతో తిరుగుతున్న వికాస్ దూబేను అక్కడే ఉన్న ఓ వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశాడు. అప్పటికే అనుమానం వచ్చిన ఆలయ సెక్యూరిటీ విచారించగా తప్పుడు ఐడీ కార్డు చూపించడంతోపాటు వారితో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న సమయంలో… ‘నేను వికాస్ దూబే ని, కాన్పూర్ వాలా’ అని గట్టిగా అరవడం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.