
843views
దేశ సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, త్రివిధ దళాల ప్రధానాధికారి బిపిన్ రావత్ తదితరులతో ప్రధాని కీలక చర్చలు జరిపారు. లడాఖ్ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలపై వీరితో చర్చించినట్టు సమాచారం. ఆ తర్వాత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌తోనూ మోడీ మాట్లాడారు. సరిహద్దు భద్రతలపై త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి సమీక్షించాక మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. సిక్కిం, లడాఖ్‌లలో ఇరు దేశాల భద్రతా దళాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో పాటు లడాఖ్ సమీపంలో చైనా, ఎయిర్‌బేస్‌ను విస్తరించడంపై శాటిలైట్ ఫొటోలు బయటపడిన వేళ జరిగిన ఈ ఉన్నత స్థాయి భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.





